Asia Cup 2023 | దాయాదుల పోరులో కోహ్లీని నిలువరించేది అతడే.. ఆసీస్ మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు
Asia Cup 2023 : చిరకాల ప్రత్యర్థులైన భారత్(India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఎప్పుడు తలపడినా ఉత్కంఠగానే ఉంటుంది. చివరి నిమిషం వరకూ అభిమానులు మునివేళ్లపై నిలబడతారు. ఆసియా కప్(Asia Cup 2023)తో ఫ్యాన్స్‌కు మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Vrat Kohli)ని అడ్డుకునే పాక్ బౌలర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా...
Asia Cup 2023 : చిరకాల ప్రత్యర్థులైన భారత్(India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఎప్పుడు తలపడినా ఉత్కంఠగానే ఉంటుంది. చివరి నిమిషం వరకూ అభిమానులు మునివేళ్లపై నిలబడతారు. ఆసియా కప్(Asia Cup 2023)తో ఫ్యాన్స్‌కు మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసే అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 2న జరిగే ఈ పోరుపై విదేశీ క్రికెటర్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Vrat Kohli)ని అడ్డుకునే పాక్ బౌలర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హగ్(Brad Hogg) ఆసక్తికర సమాధానం చెప్పాడు. పాకిస్థాన్‌పై చెలరేగి ఆడే విరాట్‌ను షాహీన్ ఆఫ్రీదీ(Shaheen Afridi) నిలువరిస్తాడని అతను అన్నాడు.
‘కొత్త బంతితో స్వింగ్‌ను రాబట్టే ఈ స్పీడ్‌స్టర్ కోహ్లీ దూకుడుకి కళ్లెం వేస్తాడని హగ్ అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో హడలెత్తించే షాహీన్ ఆఫ్రీదీ ఈసారి కోహ్లీని ఇబ్బంది పెడతాడు. దాయాదుల మ్యాచ్‌లో భారత టాపార్డర్, ఆఫ్రీదీ మధ్య పోరాటం ఆసక్తికరంగా ఉండనుంది. నా దృష్టిలో మ్యాచ్ ఎవరు గెలుస్తారు? అనేది ఆఫ్రీదీని ఎదుర్కోవడంపైనే ఆధారపడి ఉంటుంది’ అని బ్రాడ్ హగ్ తెలిపాడు.
బ్రాడ్ హగ్, విరాట్ కోహ్లీ

ఇప్పటి వరకూ కోహ్లీ నాలుగుసార్లు ఆఫ్రీదీ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అయితే.. ఒక్కసారి మాత్రమే అతడి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2021, 2022 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ అతడి బౌలింగ్‌లో చెలరేగాడు. ఆ రెండు ఇన్నింగ్స్‌ల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు పిండుకున్నాడు. అది కూడా154.54 స్ట్రయిక్ రేటుతో ఆడాడు.
హ్యరిస్ రౌఫ్ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన కోహ్లీ

నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయానికి 34 రన్స్ అవసరమయ్యాయి. అప్పటికే జోరు మీదున్న కోహ్లీ 18వ ఓవర్లో 22 రన్స్ కొట్టాడు. ఆఫ్రీదీ వేసిన ఆ ఓవర్లో రెండు ఫోర్లతో కలిపి 17 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత హ్యరిస్ రౌఫ్ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టి ఇండియాను గెలిపించాడు. విరాట్ 82 నాటౌట్‌తో నిలిచిన ఆ ఇన్నింగ్స్‌ను పాక్ బౌలర్లు ఇప్పట్లో మర్చిపోలేరు.
ఇవి కూడా చదవండి
Asia Cup 2023 | ఫాస్టెస్ట్ సెంచరీ క్లబ్లో పాక్ బ్యాటర్.. మిగతా ముగ్గురు ఎవరంటే..?
Durand Cup 2023 | రెచ్చిపోయిన ఈస్ట్ బెంగాల్ ఫ్యాన్స్.. ప్రత్యర్థి మద్దతుదారులపై ఇటుకలతో దాడి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

