శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 20:45:28

ENGvAUS: ఇంగ్లాండ్‌ లక్ష్యం 158

ENGvAUS: ఇంగ్లాండ్‌ లక్ష్యం 158

సౌతాంప్టన్‌: ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో  ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది.  అరోన్‌ ఫించ్‌(40), మార్కస్‌ స్టాయినీస్‌(35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఆసీస్‌ 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆరంభంలో 30 పరుగులకే 3వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడిన కంగారూలు ఆఖర్లో కొంచెం ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(26), ఆస్టన్‌ అగర్‌(23) చివర్లో విజృంభించడంతో  ఆసీస్‌ 150 పరుగుల మార్క్‌   దాటింది.  ఆర్చర్‌ వేసిన 20వ ఓవర్లో  కమిన్స్‌ ఫోర్‌,సిక్సర్‌ బాదడంతో 18 పరుగులు రాబట్టింది.  ఇంగ్లాండ్‌ బౌలర్లలో  క్రిస్‌ జోర్డాన్‌ రెండు వికెట్లు తీశాడు. logo