శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 14, 2020 , 00:13:51

నేడు ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌

నేడు ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) తుది అంకానికి చేరింది. ఐదు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ఐఎస్‌ఎల్‌ ఆరోసీజన్‌ ఫైనల్‌ శనివారం జరుగనుంది. కొవిడ్‌-19 కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఖాళీ కుర్చీల మధ్య ఏటీకే, చెన్నయిన్‌ ఎఫ్‌సీ మూడో టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఏటీకే 2014, 16లో టైటిల్‌ నెగ్గితే.. చెన్నయిన్‌ 2015, 2017-18లో ట్రోఫీ చేజిక్కించుకుంది. మరి లీగ్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసేదెవరో నేడు తేలనుంది. ఈ సీజన్‌లో ప్రేక్షకులను అనుమతించకుండా మ్యాచ్‌లు నిర్వహించడం ఇది రెండోసారి. ఇంతకుముందు నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీ మధ్య గువాహటి వేదికగా జరుగాల్సిన మ్యాచ్‌కు కూడా అభిమానులను అనుమతించలేదు. అప్పట్లో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో తలుపులు మూసి మ్యాచ్‌ నిర్వహించారు.


logo