KL Rahul : భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ప్రేయసి బాలీవుడ్ నటి అథియా శెట్టితో కొత్త ఏడాది సంబురాలు చేసుకున్నాడు. వీళ్లిద్దరూ దుబాయ్‌లో 2023కి స్వాగతం పలికారు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అథియా, రాహుల్ సన్నిహితంగా, నవ్వుతూ ఉన్న ఫొటోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాహుల్, అథియా కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రేమజంట జనవరి 21-23 తేదీల మధ్య పెళ్లి చేసుకోనుందనే వార్తలు వచ్చాయి. అయితే.. అథియా తండ్రి సునీల్ శెట్టి ఈ వార్తలను ఖండించాడు.
‘రాహుల్, అథియా పెళ్లి గురించిన వదంతులను నేను కూడా విన్నాను. వాళ్లిద్దరూ తమ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నారు. త్వరలోనే సరైన సమయం, తేదీ, వేదిక చూసి వాళ్ల వివాహం జరిపిస్తాం’ అని సునీల్ శెట్టి వెల్లడించాడు. బంగ్లా పర్యటనలో విఫలమైన రాహుల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాంతో సెలక్షన్ కమిటీ శ్రీలంక సిరీస్‌కు అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఓపెనర్‌గా ఇషాన్ అద్భుతంగా ఆడుతుండడంతో రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అంటున్నారు మాజీ క్రికెటర్లు. మూడో వన్డేలో ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అతను 126 బంతుల్లోనే 200 పరుగులు చేశాడు.
అథియా శెట్టి 2015లో హీరో సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మూడేళ్ల క్రితం మోతీచూర్ ఛక్నాచోర్ అనే సినిమాలో చేసింది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ లీడ్ రోల్ చేశాడు.