పెర్త్: చాలా గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియా జట్టులోకి వచ్చేశాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు అతను రెఢీ అయ్యాడు. అయితే పెర్త్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో.. చీర్‌ఫుల్‌గా కనిపించాడు కోహ్లీ. మాస్టర్ బ్యాటర్ విరాట్.. నెట్స్ సమయంలో కొందరు ప్లేయర్లను ఆటపట్టించాడు కూడా. జోకులు చేస్తూ.. నవ్వుతూ.. నవ్విస్తూ.. క్రికెటర్లతో సందడి సందడి క్రియేట్ చేశాడు. ప్రాక్టీస్ సమయంలో ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ వీడియో క్లిప్స్ కొన్ని ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, బ్యాటర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్షర్ పటేల్, శుభమన్ గిల్‌తో కోహ్లీ ఫుల్ హంగామా చేశాడు. అర్షదీప్ కూడా కోహ్లీ తరహాలో ఫన్నీ మూవ్స్ ఇచ్చాడు. ఇక కేఎల్ రాహుల్.. కోహ్లీ తన కోతి వేషాలతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. అక్షర్, శుభమన్తో జోకులేస్తూ.. తెగ నవ్వేశారు. మార్చి 9వ తేదీన జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చివరి సారి వన్డే మ్యాచ్ ఆడాడు కోహ్లీ. ఆ తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రెఢీ అయ్యాడు.
కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక 302 వన్డేలు ఆడిన అతను వాటిల్లో 14,181 రన్స్ చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 57.88గా ఉంది. ఈ ఫార్మాట్లో అత్యధిక రన్స్ చేసిన రెండోవ బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ వన్డే ఇన్నింగ్స్‌లో 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
VIRAT KOHLI, THE ENTERTAINER IS BACK IN TEAM INDIA.🤣♥️
– What a Character, King Kohli.
— MANU. (@IMManu_18) October 17, 2025