టోక్యో: ఇండియన్ చాంపియన్ బాక్సర్ మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లోనే అనూహ్యంగా ఓడిన విషయం తెలుసు కదా. అయితే తాను గెలిచానని భావించి సంబరాలు చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఓడిన విషయం తెలుసుకొని జడ్జీల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే తాజాగా తన రింగ్ డ్రెస్‌పై ఆమె లేవనెత్తిన సందేహాలు చూస్తుంటే.. ఆమెకు అన్యాయం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బౌట్‌కు నిమిషం ముందు మాత్రమే తన రింగ్ డ్రెస్ మార్చుకోవాలని చెప్పారని, ఎవరైనా దీనికి సమాధానం చెబుతారా అంటూ ఆమె శుక్రవారం ట్వీట్ చేసింది.
ఆశ్చర్యంగా ఉంది.. రింగ్ డ్రెస్ అంటే ఏంటో ఎవరైనా చెబుతారా. బౌట్‌కు నిమిషం ముందు నాకు రింగ్ డ్రెస్ మార్చుకోమని చెప్పారు అని ట్విటర్లో మేరీకోమ్ వెల్లడించింది. నిజానికి గురువారం జరిగిన బౌట్లో తాను ఓడిపోయిన విషయం.. ఇండియా స్పోర్ట్స్ మినిస్టర్ కిరన్ రిజిజు చేసిన ట్వీట్‌తోనే తెలిసిందని ఆమె చెప్పడం విశేషం. తాను గెలిచాననే భావించానని, డోపింగ్ సెంటర్‌కు శాంపిల్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలోనూ తాను అదే ఫీలింగ్‌తో ఉన్నానని చెప్పింది. తనకు జరిగిన అన్యాయంపై ఆమె అప్పీల్ చేసే అవకాశం కూడా ఈ ఒలింపిక్స్‌లో లేదు. గతంలోనూ తనకు ఇలాంటి ఘటనలు జరిగాయని ఆమె చెప్పింది.
Surprising..can anyone explain what will be a ring dress. I was ask to change my ring dress just a minute before my pre qtr bout can anyone explain. @PMOIndia @ianuragthakur @KirenRijiju @iocmedia @Olympics pic.twitter.com/b3nwPXSdl1
— M C Mary Kom OLY (@MangteC) July 30, 2021