న్యూఢిల్లీ : కౌలాలంపూర్ వేదికగా ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే అరంగేట్రం అండర్-19 మహిళల జూనియర్ ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. యువ క్రికెటర్ నికీ ప్రసాద్..భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సానిక చాల్కె వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనుంది. తెలంగాణ యువ క్రికెటర్లు గొంగడి త్రిష, ద్రుతితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేసర్ ఎండీ శబ్నమ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. గ్రూపు-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, నేపాల్ ఉండగా, గ్రూపు-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆతిథ్య మలేషియా పోటీపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఈనెల 15న పాక్‌తో, 17న నేపాల్‌తో ఆడుతుంది. గ్రూపులో టాప్-2లో ఉన్న జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి