కాలి(కొలంబియా):ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ మిక్స్డ్ జట్టు 4X400 రిలేలో ఆసియా రికార్డు నెలకొల్పింది. భరత్ శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపాల్ చౌదరిలతో కూడి భారత జట్టు 3ని.19.62 సెకండ్లలో గమ్యం చేరి హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో హీట్‌లో పరుగెత్తిన అమెరికా జట్టు 3ని.18.65సె.తో అందరికంటే ముందంజలో ఉంది. ఫైనల్స్ బుధవారం జరుగుతుంది. నైరోబిలో నిర్వహించిన గత చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్యం గెలుచుకుంది. రూపాల్ మినహా మిగతా ముగ్గురు పాతకాపులే. కాగా మహిళల 800 మీ. పరుగులో భారత్ అథ్లెట్ ఆశాకిరణ్ సెమీస్‌కు చేరుకున్నది.