Asian Games 2023 | ఆసియా క్రీడల్లో భారత సెయిలర్ల సత్తా.. ఒకే రోజు మూడు పతకాలు
Asian Games 2023 | చైనాలో జరుగుతున్న 19వ ఎడిషన్ ఆసియా క్రీడల్లో భారత సెయిలర్లు సత్తా చాటారు. మూడో రోజైన మంగళవారం భారత సెయిలర్లు ఏకంగా మూడు పతకాలు సాధించారు.
న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న 19వ ఎడిషన్ ఆసియా క్రీడల్లో భారత సెయిలర్లు సత్తా చాటారు. మూడో రోజైన మంగళవారం భారత సెయిలర్లు ఏకంగా మూడు పతకాలు సాధించారు. ఇవాళ ఉదయాన్నే 17 ఏళ్ల సెయిలర్ నేహా థాకూర్ (Neha Thakur) ఐఎల్సీఏ-4 ఈవెంట్లో 32 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. థాయిలాండ్‌కు చెందిన నొప్పసొరన్ కున్బూంజన్ టాప్ స్కోర్‌తో స్వర్ణ పతకం గెలువగా, సింగపూర్‌కు చెందిన కీరా మేరీ కార్లైల్ 28 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆ తర్వాత మెన్స్ విండ్ సర్ఫర్ RS:X (windsurfer RS:X) ఈవెంట్లో మరో సెయిలర్ ఎబాద్ అలీ పతకం సాధించాడు. రేసులో 52 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచాడు. ఆ తర్వాత మరో సెయిలర్ 24 ఏళ్ల విష్ణు శరవణన్ మెన్స్ డింగీ ICLA-7 ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. సింగపూర్ సెయిలర్ గోల్డ్ మెడల్, దక్షిణకొరియా సెయిలర్ రజతం సొంతం చేసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

