హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల రోయింగ్ విభాగంలో భారత్ మూడో పతకం నెగ్గింది. మెన్స్ 8 టీమ్ ఈవెంట్లో భారత రోయింగ్ జట్టు రజత పతకం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా చైనా గోల్డ్ మెడల్ దక్కించుకోగా, ఇండోనేషియా మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. భారత్ రెండో స్థానంలో నిలిచి రజతం అందుకుంది.
కాగా, ఇప్పటికే మెన్స్ పెయిర్ ఈవెంట్లో బాబులాల్ యాదవ్, లేఖ్ రామ్ జట్టు కాంస్యం సాధించింది. అంతకుముందు మెన్సి లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్ జాట్లాల్, అర్వింద్ సింగ్ టీమ్ రజతం నెగ్గింది. దాంతో రోయింగ్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య మూడుకు చేరింది. షూటింగ్‌లోనూ భారత్‌కు రెండు పతకాలు దక్కడంతో మొత్తం పతకాల సంఖ్య ఐదుకు పెరిగింది.