బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగు అథ్లెట్ జ్యోతి ఎర్రాజి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం నుంచి థాయ్‌లాండ్ వేదికగా జరుగనున్న టోర్నీలో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, షాట్‌పుటర్ తజిందర్‌పాల్ సింగ్, అంజలీ దేవి సహా మొత్తం 53 మంది భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్, జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్‌తో పాటు అథ్లెట్లు అన్ను రాణి, శైలి సింగ్, స్వప్న బర్మన్, పరుల్ చౌదరి పతకాలపై ఆశలు రేపుతున్నారు. చివరిసారిగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ 16 పతకాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది.