IOA : ఆసియా క్రీడల్లో పతకాలతో మెరిసిన భారత అథ్లెట్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆర్చరీ, రెజ్లింగ్‌లో అసమాన ప్రతిభ కనబరిచిన ఇద్దరు ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నగోయలో స్వర్ణం గెలుపొందిన 17 ఏళ్ల ఆర్చర్ కుంకుమ్ మొహద్ (Kumkum Mohod).. పసిడిని పట్టేసిన కుస్తీ యోధుడు సుజీత్ కల్కల్(Sujeet Kalkal) లు తొలిసారి ప్రవేశపెట్టిన అవార్డులు గెలుచుకున్నారు. కుంకుమ్ జస్పాల్ రాణా(Jaspal Rana) పురస్కారానికి ఎంపికవ్వగా.. రాజా రణ్‌ధీర్ సింగ్ (Raja RandhirSingh) అవార్డు సుజీత్‌ను వరించిందని సోమవారం భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.
ఐచీ -నగోయ వేదికగా జరిగిన 18వ ఆసియా క్రీడల్లో అసాధారణ ప్రదర్శనతో స్వర్ణ కాంతులు విరజిమ్మిన కుంకుమ్ మొహద్(ఆర్చర్), సుజీత్ కల్కల్ (రెజ్లర్)లకు మరో గౌరవం దక్కింది. భారత క్రీడా దిగ్గజాలు దివంగత జస్పాల్ రాణా, రాజా రణ్‌ధిర్ సింగ్‌ల పేరుతో తొలిసారి ఏర్పాటు చేసిన అవార్డులకు వీరిద్దరు ఎంపికయ్యారు.
A HISTORIC FIRST FOR INDIAN ARCHERY! 🎯🥇🇮🇳
Congratulations to Kumkum Anil Mohod on winning India’s first-ever GOLD in the Recurve Women’s Individual event at #AsianGames2026!
This phenomenal triumph also secures a direct ticket to the LA 2028 Olympics.
#Cheer4Bharat https://t.co/TVzt8TKeOU
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 3, 2026
‘అరంగేట్రం ఆసియాడ్లోనే రికర్వ్ ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొల్లగొట్టిన 17 ఏళ్ల కుంకుమ్.. జస్పాల్ రాణా అవార్డును గెలుచుకోగా.. పురుషుల 65 కిలోల ఫ్రీ స్టయిలో విభాగంలో పసిడిని అందించిన 23 ఏళ్ల సుజీత్‌కు రాజా రణధీర్ సింగ్ అవార్డు దక్కింది’ అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పేర్కొంది.
Unbelievable Comeback 🙌
2-9 down and just 100 seconds left.
Most wrestlers fold but Sujeet Kalkal scored 8 straight points and won Asian Games gold 10-9….the decisive takedown with 11 seconds remaining.
Same day he beat Olympic champion Kotaro Kiyooka.India’s first wrestling gold since 2018.❤️
Salute Sujeet 🙌🐅💪— Major Surendra Poonia (@MajorPoonia) October 2, 2026
‘కుంకుమ్‌ను మొట్టమొదటి జస్పాల్ రాణా అవార్డుకు ఎంపిక చేయడం సరైనదే. జస్పాల్ సైతం తన మాదిరిగానే చిన్న వయసులోనే 1994 ఆసియా క్రీడల్లో పతకంతో మెరిశాడు. ఒత్తిడిలోనూ ఆమె కనబరిచిన స్థిరత్వం.. అత్యుత్తమ ప్రదర్శన చేయడం భారత ఆర్చరీకి ఎంతో శుభపరిణామం. రెజ్లింగ్ అనేది భారతీయ క్రీడ. సుజీత్ ప్రదర్శనను ఏళ్ల తరబడి చెప్పుకుంటారు. అతడి గోల్డ్ మెడల్‌ను కీర్తిస్తూనే ఉంటారు. ఫైనల్లో అతడు ఓటమిని ఒప్పుకోలే. రజతాన్ని స్వీకరించకూడదనే అతడి ద్రుఢచిత్తం దేశ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానముంది. అతడు లాస్ఏంజెల్స్లోనూ గోల్డ్ మెడల్ గెలవాలని ఆశిస్తున్నా’ అని ఉష తెలిపింది.
ఆసియా క్రీడల మహిళల రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. పదేళ్లుగా స్వర్ణాన్ని తన్నుకుపోతున్న దక్షిణ కొరియా ఆధిపత్యానికి గండికొడుతూ భారత బృందం అగ్రస్థానంలో నిలవడంతో తను కీలకమైంది. అంకిత భకత్, కీర్తిలతో కలిసి పసిడి అందించిన తను ఆపై వ్యక్తిగత విభాగంలోనూ కొరియా ఆర్చర్ ఒహ్ యెజిన్ను 6-5తో ఓడించి గోల్డెన్ గర్ల్ అనిపించుకుంది. ఇక పురుషుల 65 కిలోల ఫ్రీ స్టయిలో విభాగంలో ఓడిపోయే స్థితి నుంచి గొప్పగా పుంజుకున్న సుజీత్ స్వర్ణంతో మెరిశాడు. మరికొన్ని సెకన్లలో ఆట ముగుస్తుందనగా 2-9తో వెనకబడిన అతడు.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 10-9తో జయకేతనం ఎగురవేశాడు.