Pickleball Championship | హైదరాబాద్, ఆట ప్రతినిధి: వచ్చే ఏడాది జనవరిలో హైదరాబాద్ వేదికగా ఆసియన్ ఓపెన్ పికిల్‌బాల్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నట్టు అమెచ్యూర్ తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్ (ఏటీపీఏ) అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసియా వ్యాప్తంగా అండర్-12, 14, 16, 19+, 35+, 60+ కేటగిరీలలో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్టు ఏటీపీఏ తెలిపింది.