Asia Cup Schedule | ఎట్టకేలకు ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది..! హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ.. సెప్టెంబర్ 2 భారత్ – పాక్ ఢీ..!
Asia Cup Schedule | ఎట్టకేలకు ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైంది. పాక్ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఈ సారి టోర్నీ హైబ్రిడ్‌లో మోడల్లో జరుగనున్నది. పాక్‌తో పాటు శ్రీలంకలో సైతం మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Asia Cup Schedule | ఎట్టకేలకు ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైంది. పాక్ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఈ సారి టోర్నీ హైబ్రిడ్‌లో మోడల్లో జరుగనున్నది. పాక్‌తో పాటు శ్రీలంకలో సైతం మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు పాక్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో ఏసీసీ హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది. అయితే, పాక్‌లోనే ఆడాలని మొదట పీసీబీ పట్టుబట్టినా చివరకు అంగీకరించింది. భారత్ తన మ్యాచులన్నింటిని శ్రీలంకలో ఆడనున్నది. సెప్టెంబర్ 2న పాక్‌తో భారత జట్టు తలపడనున్నది.
తొలిమ్యాచ్ ముల్తాన్‌లో..
టోర్నీలో ఆరు జట్లు పాల్గొననుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్-బీలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్థాన్ – నేపాల్ మధ్య ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ జరుగనున్నది. అదే సమయంలో శ్రీలంక గడ్డపై తొలి మ్యాచ్ ఆగస్టు 31న బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య క్యాండీ వేదికగా జరుగనున్నది.
భారత జట్టు షెడ్యూల్..
భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న దాయాది దేశం ప్యాక్‌తో క్యాండి వేదికగా ఆడనున్నది. ఆ తర్వాత అదే నెల 4న ఇదే మైదానంలో నేపాల్‌లో తలపడనున్నది. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. ఇందులో విజయం సాధించిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగనున్నది.
ఆసియా కప్ షెడ్యూల్

Shedule
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

