ఆసియా కప్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో జపాన్ చేతిలో ఓటమిపాలైన భారత్.. మూడో స్థానం కోసం పాక్తో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు 4-3 గోల్స్ తేడాతో పాక్పై విజయం సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ టోర్నీ మరో సెమీఫైనల్లో సౌత్ కొరియా చేతిలో 5-6 తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. సెమీస్లో ఓడిన రెండు జట్లు మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. ఢాకా వేదికగా జరిగిన ఈ పోటీలో భారత్ పైచేయి సాధించి, టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించింది.