PAK vs BAN | పాక్ పేసర్ల ధాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్.. 193 పరుగులకే ఆలౌట్
PAK vs BAN | ఆసియాకప్ 2023లో పాకిస్తాన్ పేసర్లు మరోసారి చెలరేగారు. సూపర్-4లో స్థానం దక్కించుకునేందుకు జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును కుప్పకూల్చారు. పాక్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో 39 ఓవర్లు పూర్తి కాకుండానే 193 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఆలౌటయ్యింది.
PAK vs BAN | ఆసియాకప్ 2023లో పాకిస్తాన్ పేసర్లు మరోసారి చెలరేగారు. సూపర్-4లో స్థానం దక్కించుకునేందుకు జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును కుప్పకూల్చారు. పాక్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో 39 ఓవర్లు పూర్తి కాకుండానే 193 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఆలౌటయ్యింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభం నుంచే పాక్ పేసర్లు షాహిన్ అఫ్రిది, నసీం షా, హారస్ రౌఫ్ చుక్కలు చూపించారు. 10 ఓవర్లు ముగిసేసరికి 50 పరుగులు కూడా చేయకుండానే బంగ్లాదేశ్ నాలుగు వికెట్లను కోల్పోయింది. టాపార్డర్ కుప్పకూలిన సమయంలో మిడిలార్డర్ ప్లేయర్లు చెలరేగారు. బంగ్లాదేశ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హాసన్ (53), రహీమ్ (64) పాక్ పేసర్లకు ధీటుగా బదులిచ్చారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడారు. ఇద్దరి భాగస్వామ్యంలో జట్టుకు కీలక స్కోర్ అందించారు. కానీ షకీబ్ హాసన్, రహీమ్ ఔటైన తర్వాత బంగ్లాదేశ్ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఆ సమయంలో మరింత చెలరేగిన పాక్ పేసర్లు వరుసగా వికెట్లను తీశారు. దీంతో 38.4 ఓవర్ల వద్ద బంగ్లాదేశ్ అన్ని వికెట్లను కోల్పోయింది. హరీస్ రవుఫ్, నసీం షా చెరో మూడు వికెట్లు తీయగా.. ఆఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, అష్రఫ్ చెరో వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- asia cup
- Ban vs Pak
- Pak vs Ban
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

