Ashwin : అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తదుపరి అడుగు ఆలస్యం కానుంది. విదేశీ లీగ్స్‌లో తొలి అడుగు ఘనంగా వేయాలనుకున్ను ఈ వెటరన్ ప్లేయర్ అనుకోకుండా దూరం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగ జరుగనున్న బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో తన ఆగమనాన్ని గొప్పగా చాటాలనుకున్న అశ్విన్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. టోర్నమెంట్ సన్నద్ధత కోసం సాధనలో ఉన్న ఈ వెటరన్ ప్లేయర్ మోకాలికి గాయమైంది. దాంతో.. తాను అందుబాటులో ఉండడం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించాడీ లెజెండరీ స్పిన్నర్.
ఆస్ట్రేలియా గడ్డపై త్వరలో జరుగునున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆడకపోవడంతో తనకు ఎంతో బాధగా ఉందని అశ్విన్ తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టంతా రికవరీ మీదనే ఉందని.. త్వరలోనే జట్టు సభ్యులను కలుస్తానని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్ స్క్వాడ్‌తో కలవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాను. కానీ, అనుకోకుండా గాయం నన్ను వెనక్కి లాగింది. ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాను. కోలుకున్న తర్వాత బలంగా తిరిగొస్తాను. ఈ క్లబ్‌తో నా తొలి చాట్ ఇది.
Ash “gutted” to miss the BBL 🤕
Full story: https://t.co/CcTXMKs8Tu pic.twitter.com/UjNccNIzaN
— ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2025
సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు, సిబ్బంది, కోచింగ్ టీమ్ అందరి ప్రేమ, స్నేహం లభించండం సంతోషం. ఇంటివద్దనే నేను కోలకుంటున్నాను. అయితే.. నేను సిడ్నీ జట్టు మ్యాచ్‌లను టీవీలో చూస్తాను. మన ఫ్రాంచైజీ పురుషుల, మహిళల జట్లను ఉత్సాహపరుస్తాను. వైద్యులు నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’ అని సుదీర్ఘ పోస్ట్‌లో అశ్విన్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగిన అశ్విన్ అవకాశం ఉన్న ప్రతి విదేశీ లీగ్‌లో తన ముద్ర వేయాలనే కసితో ఉన్నాడు. ఒకే ఏడాదిలో మూడు విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు తాను సిద్ధమేనని ప్రకటించాడు కూడా. మొదటగా హాంకాంగ్ సిక్సర్స్(HongKong Sixers) టోర్నీలో ఆడేందుకు ఓకే చెప్పిన అశ్విన్.. ఇంటర్నేషనల్ టీ20తో పాటు బిగ్‌బాష్ లీగ్‌లోనూ మెరవనున్నాడు. అలానే బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఆడేందుకు అంగీకరించాడు. కానీ, మోకాలి గాయంతో ఈ టోర్నీలో అతడు ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.

డిసెంబర్ 14 నుంచి బిగ్‌బాష్ లీగ్ పదిహేనో సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సిడ్నీ థండర్స్ తరఫున అశ్విన్ అరంగేట్రం చేయనున్నాడు అశ్విన్. మేటి స్పిన్నర్ అయిన యశ్ రాకతో తమ జట్టుకు తిరుగుండదని భావించిన సిడ్నీ యాజమాన్యానికి పెద్ద షాక్ తగిలినట్టైంది.