Ashwin : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) కొత్త జర్నీకి శ్రీకారం చుడుతున్నాడు. విదేశీ లీగ్స్‌లో ఆడేందుకే ఐపీఎల్ నుంచి వైదొలిగిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ వేలానికి సిద్ధమవుతున్నాడు. దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20లీగ్ (ILT20)లో అశ్విన్ పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. నాలుగో సీజన్ కోసం సెప్టెంబర్ 30న జరుగబోయే వేలం జరుగనుంది. ఈ ఆక్షన్‌లో మ్యాచ్ విన్నర్ అయిన యశ్ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించే అవకాశముంది.
ఐపీఎల్‌కు అల్విదా పలికిన అశ్విన్ తన భవిష్యత్ ప్రణాళికలు.. తదుపరి ఆడబోయే లీగ్ గురించి క్రిక్‌బజ్‌తో పలు విషయాలు పంచుకున్నాడు. తాను ఇంటర్నేషనల్ టీ20 వేలంలో పేరు నమోదు చేసుకున్నానని భారత మాజీ స్పిన్నర్ వెల్లడించాడు. ‘త్వరలోనే ఐఎల్టీ20 నాలుగో సీజన్ వేలం మొదలవ్వనుంది. కాబట్టి నా పేరును రిజిష్టర్ చేసుకున్నా. నన్ను ఎవరో ఒకరు కొంటారనే నమ్మకంతో ఉన్నాను’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Days after retiring from cricket, Ravichandran Ashwin has signed up for the ILT20 auction, which will be held in Dubai on September 30. 🏏🤩#Ashwin #Cricket #ILT20 #Sportskeeda pic.twitter.com/OgpwB3LCTn
— Sportskeeda (@Sportskeeda) August 31, 2025
అదే జరిగితే ఈ లీగ్‌లో ఆడనున్న నాలుగో భారతీయుడిగా అశ్విన్ గుర్తింపు సాధిస్తాడు. అతడికంటే ముందు రాబిన్ ఊతప్ప, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు ఐఎల్టీ20లో తమ సత్తా చాటారు. ఆరంభ సీజన్ నుంచి ఈ మెగా టోర్నీలో ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో ఐపీఎల్ సిస్టర్ ఫ్రాంచైజీ టీమ్స్ కూడా ఉన్నాయి. ఆ ఆరు టీమ్‌లు ఇవే.. అబుదాబీ నైట్ రైడర్స్, డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్.
ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్ అయిన అశ్విన్ ఐదు ఫ్రాంచైజీల తరఫున ఇరగదీశాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు(187) తీసిన ఐదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడీ స్పిన్ దిగ్గజం. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 97 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున 35 వికెట్లు, పంజాబ్ కింగ్స్ బౌలర్‌గా 25 వికెట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ అస్త్రంగా 20 వికెట్లు, పుణే రైజింగ్ సూపర్ జెయింట్స్ ప్రధాన స్పిన్నర్‌గా 10 వికెట్లు పడగొట్టాడీ వెటరన్.
Ravichandran Ashwin — his impact in the IPL has been incredible. 🔥💪#Cricket #Ashwin #IPL #Chennai pic.twitter.com/SClUQdK0ER
— Sportskeeda (@Sportskeeda) August 27, 2025