Ashes Series 2027 | యాషెస్ షెడ్యూల్ విడుదల.. ఏకకాలంలో అబ్బాయిలు, అమ్మాయిల మ్యాచ్‌లు..!
Ashes Series 2027 : టెస్టు క్రికెట్లోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా పేరొందిన యాషెస్ సిరీస్(Ashes Series) షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరుగునున్న సిరీస్ తేదీలను గురువారం ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వెల్లడించింది.
Ashes Series 2027 : టెస్టు క్రికెట్లోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా పేరొందిన యాషెస్ సిరీస్(Ashes Series) షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరుగునున్న సిరీస్ తేదీలను గురువారం ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వెల్లడించింది. ఈసారి ఏకకాలంలో ఆస్ట్రేలియా పురుషుల, మహిళల జట్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాయి. తొలుత పురుషుల యాషెస్ జూన్ 18 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మొదలవ్వనుంది. ఆపై జూన్ 24న మహిళల ఏకైక యాషెస్ టెస్టు హెడింగ్లే మైదానంలో జరుగనుంది.
గత యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై చావుదెబ్బ తిన్న ఇంగ్లండ్ ప్రతీకారానికి సిద్ధమవుతోంది. అప్పటి ఓటమికి బదులు తీర్చుకునేందుకు వచ్చే ఏడాది జూన్‌లో సిరీస్ నిర్వహణకు సిద్ధమవుతోంది ఇంగ్లండ్ వేల్స్ బోర్డు. గురువారం యాషెస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి ఏకకాలంలో ఆసీస్ పురుషుల, మహిళల జట్లు ఇంగ్లండ్‌లో పర్యటించేలా సిరీస్‌ను ప్లాన్ చేసింది ఈసీబీ.
JUST IN: The schedule for next year’s men’s Ashes has been announced 🏴🇦🇺 pic.twitter.com/5dO8neXABu
— Cricinfo (@cricinfo) July 23, 2026
డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం
ఓవల్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్ (జూన్ 9-13) ముగియగానే యాషెస్ సిరీస్ షురూ కానుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పురుషుల జట్ల మధ్య జూన్ 18న ట్రెండ్ బ్రిడ్జ్‌లో తొలి టెస్టు మొదలవ్వనుంది. మహిళల యాషెస్ ఏకైక టెస్టు జూన్ 24న లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరుగనుంది. అనంతరం మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఆసీస్ మహిళల జట్టు తలపడనుంది.
JUST IN: The fixtures for the 2027 women’s Ashes are here 🏴🇦🇺 pic.twitter.com/IHM9kQoZal
— Cricinfo (@cricinfo) July 23, 2026
పురుషుల యాషెస్ షెడ్యూల్
1. మొదటి టెస్టు – జూన్ 18 -22 ట్రెంట్ బ్రిడ్జ్(నాటింగమ్)
2. రెండో టెస్టు జూన్ 30- జూలై 4, లార్డ్స్ (లండన్)
3. మూడో టెస్టు జూలై 8 -12, ఎడ్జ్‌బాస్టన్(బర్మింగ్హమ్)
4. నాలుగో టెస్టు జూలై 21-25, రోస్ బౌల్(సౌతాంప్టన్)
5. ఐదో టెస్టు జూలై 29- ఆగస్టు 2, ది ఓవల్ (లండన్)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

