ముంబై: ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్(Arvind Sawant) ఇవాళ క్షమాపణలు చెప్పారు. బీజేపీ నేత షైనా ఎన్సీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా తాను మహిళలను అవమానపరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయని, తన 55 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఏమీ చేయలేదన్నారు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు తనను నిరాశపరిచాయని, అయినా ఒకవేళ తాను ఎవరినైనా గాయపరిచి ఉంటే, దానికి క్షమాపణలు చెబుతున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. బీజేపీ నేత షైనాను ఉద్దేశిస్తూ.. ఇంపోర్టెడ్ మాల్ అంటూ ఎంపీ అరవింద్ కొన్ని రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.