HCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావుకు ఢిల్లీకి చెందిన స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాదికి గాను ‘బెస్ట్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్’గా జగన్మోహన్రావుకు అవార్డు దక్కింది. హ్యాండ్‌బాల్, క్రికెట్‌తో పాటు పలు క్రీడాంశాల్లో క్రీడాకారులకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం, క్రీడారంగ అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించిన ఫౌండేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది.