న్యూఢిల్లీ: మూడుసార్లు నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ వేణుగోపాల్ చంద్రశేఖర్(64) కన్నుమూశారు. అర్జున అవార్డు గ్రహీత, భారత మాజీ టేబుల్ టెన్నిస్ ప్లేయర్
చంద్రశేఖర్ కొవిడ్-19 సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. భారత్లో ప్రముఖ క్రీడాకారులలో ఒకరైన చంద్రశేఖర్ మూడుసార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచారు. చెన్నైలో జన్మించిన చంద్ర 1982 కామన్వెల్త్ క్రీడల్లో సెమీఫైనల్ వరకు చేరుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత కోచ్గానూ విజయవంతమయ్యారు.
We have lost a champion who fought death 37 years ago. Saddened to hear of the passing of V Chandrasekar Sir. Table Tennis as a sport has lost a great mentor, coach and an amazing player. He made the sport famous in the early 80's. Rest in Peace, Sir. 🙏🏽 pic.twitter.com/120Pb2RVn4
— Sharath Kamal OLY (@sharathkamal1) May 12, 2021