న్యూయార్క్: తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి జులియస్ బేర్ చెస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో అర్జున్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద కూడా నాలుగో స్థానంతో ముందంజ వేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ 34 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, అర్జున్ 25, హాన్స్ నీమన్ 24, ప్రజ్ఞానంద 23 పాయింట్లు సాధించారు.