లండన్: యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసి మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రిటన్‌లో జరిగిన డబ్ల్యూఆర్ చెస్ మాస్టర్స్ ట్రోఫీని అర్జున్ సొంతం చేసుకున్నాడు. శుక్రవారం మాక్సైమ్ వచియర్-లగ్రవె (ఫ్రాన్స్)తో ముగిసిన ఫైనల్లో రెండు గేమ్‌లను డ్రా చేసుకున్న అర్జున్ టైటిల్ విజేతగా నిలిచాడు.
16 మంది పాల్గొన్న ఈ టోర్నీలో అతడు ఓటమన్నదే లేకుండా రాణించాడు. ఫైనల్లో ఒక్క గేమ్‌ను గెలిచినా అర్జున్ ఎలో రేటింగ్ 2,800 పాయింట్లకు చేరుకునేవాడు. కానీ డ్రాతో అతడు 2,797తో మూడో స్థానంలో నిలిచాడు.03