పంజిమ్ : చెస్ ప్రపంచకప్‌లో భారత ఆశలు మోస్తున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. క్వార్టర్స్‌లో చైనా ప్లేయర్ వీయి తో జరిగిన తొలి గేమ్‌ను సులువైన డ్రా చేసుకున్నాడు. సోమవారం జరిగిన క్వార్టర్స్ పోరును నల్లపావులతో ఆడిన అర్జున్.. 31 ఎత్తుల తర్వాత గేమ్‌ను డ్రాగా ముగించాడు. 206 మంది బరిలోకి దిగిన ఈ టోర్నీలో క్వార్టర్స్ మొదలయ్యేసరికి 8 మంది మిగలగా వీరిలో టాప్-3లో నిలిచివారు వచ్చే ఏడాది ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తారు.
మరి అర్జున్ ఆ జాబితాలో ఉంటాడా? లేడా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ నొడిర్బెక్.. 1-0తోజర్మన్ ఆటగాడు అలగ్జాండర్ డొంచెంకోను ఓడించి క్వార్టర్స్ పోటీల్లో తొలి విజయాన్ని నమోదుచేశాడు.