కాన్పూర్: జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్ పోరులో అర్జున్…వీ ప్రణవ్(తమిళనాడు)పై విజయం సాధించాడు. దీంతో 7.5 పాయింట్లతో ప్రస్తుతం అర్జున్ టాప్‌లో నిలిచాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అర్జున్..ప్రణవ్ను 60 ఎత్తుల్లో ఓడించాడు. ఎనిమిదో రౌండ్ వరకు గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ చిత్తాంబరం, ఇనియాన్తో కలిసి సంయుక్త ఆధిక్యంలో కొనసాగిన అర్జున్ ఈ విజయంతో వారిని అధిగమించాడు. మిగతా గేముల్లో ఇనియాన్తో గేమ్‌ను గుకేశ్ డ్రా చేసుకోగా, స్వప్నిల్, అరవింద్ మధ్య గేమ్ డ్రా అయ్యింది.