పారిస్: భారత షూటర్ అర్జున్ బబుటా .. పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆ ఈవెంట్ ఇవాళ జరగనున్నది. చండీఘడ్‌కు చెందిన రైఫిల్ షూటర్ అర్జున్.. భారత షూటింగ్ బృందంలో 2016 నుంచి ఉన్నాడు. 2016లో జరిగిన ప్రపంచ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్లో అతను స్వర్ణ పతకం గెలిచాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మెన్స్ టీమ్ ఈవెంట్లో అతను ఆ మెడల్ కొట్టాడు. 2018లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫల్ జూనియర్ మెన్ ఈవెంట్లో బ్రాంజ్ సాధించాడు.