FIDE Chess World Cup : ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi), పెండ్యాల హరికృష్ణ (Pendyala Harikrishna) డ్రాతో సరిపెట్టుకున్నారు. గోవా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ప్రీక్వార్టర్స్ చేరిన ఈ ఇద్దరూ ఐదో రౌండ్ తొలి గేమ్‌ను డ్రాతో ముగించారు. ప్రత్యర్ధులు సమర్ధంగా నిలువరించిన అర్జున్, హరికృష్ణ మ్యాచ్‌ను రేపటికి తీసుకెళ్లారు. దాంతో.. శనివారం జరుగబోయే రెండో రౌండ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు ఇద్దరు.
ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న అర్జున్ ఎరిగేసి చెస్ వరల్డ్ కప్‌లో గొప్పగా ఆడుతున్నాడు. అద్భుత విజయాలతో ప్రీ-క్వార్టర్స్ చేరిన తెలంగాణ కుర్రాడు ఐదో రౌండ్లో రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ లెవొన్ అరోనియన్‌తో తలపడ్డాడు. తెల్లపావులతో ఆడిన అర్జున్ తెలివైన వ్యూహాలతో ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచాడు. అతడి ఎత్తులకు బదులిచ్చేందుకు 21వ మూవ్లో పావును కదిల్చేందుకు లెవోన్ ఏకంగా అరగంట ఆలోచించాడంటే మనోడి సత్తా అర్ధమవుతుంది.
Arjun Erigaisi vs Levon Aronian Game 1 of Round 5 ENDS in a DRAW.
Such a solid game today, there was a moment where it really felt like Arjun might take it but it eventually settled into a draw.
Tomorrow Arjun plays with the black pieces. Hoping for a win tomorrow 🔥🇮🇳 pic.twitter.com/3GERnpDpWe
— Pushkar (@Musafirr_hu_yar) November 14, 2025
మరో మ్యాచ్‌లో హరికృష్ణ పెద్దగా కష్టపడకుండానే డ్రా చేసుకున్నాడు. ప్రత్యర్ధి అయిన జోస్ మార్టినేజ్ ఎత్తులను ముందే పసిగట్టిన అతడు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో.. ఇరువురు 41వ ఎత్తులో డ్రాకు అంగీకరించారు. చెస్ ప్రపంచకప్‌లో తదుపరి అడుగు వేసేందుకు అర్జున్, హరికృష్ణకు రెండో గేమ్ కీలకం కానుంది.