IND vs USA : న్యూయార్క్ పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arsh Singh) చెలరేగుతున్నాడు. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండు వికెట్లు తీసి అమెరికాను ఒత్తిడిలోకి నెట్టాడు. తొలుత ఓపెనర్ శయాన్ జహంగీర్(0)ను ఎల్బీగా వెనక్కి పంపిన అర్ష్‌దీప్.. ఆ కాసేపటికే ఆండ్రీస్ గౌస్(2)ను డగౌట్‌కు చేర్చాడు.
ప్రస్తుతం కెప్టెన్ అరోన్ జోన్స్(10), స్టీవెన్ టేలర్(5)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డారు. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. పవర్ ప్లేలో అమెరికా స్కోర్.. 18/2