FIFA World Cup : లూసెయిల్ స్టేడియంలో ఫ్రాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో లియోనల్ మెస్సీ ఫైనల్లో జట్టుకు తొలి గోల్ అందించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మెస్సీ 23వ నిమిషంలో లభించిన పెనాల్టీ షూట్‌ను గోల్‌గా మలిచాడు. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న అతను గోల్ అనంతరం సంబరాలు చేసుకున్నాడు. దాంతో అతను ఈ వరల్డ్ కప్‌లో ఆరో గోల్ నమోదు చేశాడు. 35వ నిమిషంలో అందివచ్చిన అవకాశాన్ని డి మరియా సద్వినియోగం చేసుకొని గోల్ కొట్టాడు. 16వ నిమిషంలో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పండడంలో విఫలమైన అతను ఈసారి గురి తప్పలేదు. దాంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలో ఉంది. తొలి అర్థభాగంలోనే రెండు గోల్స్ కొట్టిన అర్జెంటీనా మ్యాచ్‌పై పట్టు సాధించింది.
ఈ టోర్నీలో మెస్సీ అత్యధికంగా ఆరు గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు రేసులో అందరికంటే ముందున్నాడు. . అర్జెంటీనాను రెండోసారి ఫైనల్‌కు చేర్చిన మెస్సీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాడు. 2014లో ప్రపంచకప్ ఫైనల్లో లో ఆ జట్టు జర్మనీ చేతిలో 1-0తో ఓటమి పాలైంది.