హైదరాబాద్, ఆట ప్రతినిధి: భాగ్యనగరం ఆతిథ్యం ఇచ్చే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో అమెరికాకు చెందిన మేటి ఆర్చర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కేసీ కౌహోల్డ్ అరంగేట్రం చేయనుంది. అక్టోబర్ 8 నుంచి 11 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 10 దేశాల నుంచి మొత్తం 12 మంది ఫారిన్ స్టార్ ఆర్చర్లు పోటీ పడుతున్నారని నిర్వాహకులు ప్రకటించారు. ఈ లీగ్లో ఆరు ఫ్రాంచైజీ జట్లు బరిలో నిలిచిన ఈ లీగ్లో మొత్తంగా 48 మంది ఆర్చర్లు పాల్గొంటారు. ముగ్గురు ఒలింపిక్ పతక విజేతలు సహా ప్రముఖ అంతర్జాతీయ ఆర్చర్లను ఏపీఎల్ రెండో సీజన్ కు రావడం గొప్ప విషయమని లీగ్ డైరెక్టర్ అనిల్ కామినేని తెలిపారు.