APL 2023: అమెరికాలోని టెక్సాస్ వేదికగా జరుగుతున్న ‘అమెరికన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఫైనల్ దశకు చేరుకున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీఎల్‌లో అంపైర్లుగా వ్యవహరిస్తున్న పలువురు అంపైర్లు అదనంగా డబ్బును డిమాండ్ చేస్తూ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అంపైర్లుగా ఉండబోమని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీఎల్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే అంపైర్లు మాత్రం తాము బ్లాక్మెయిల్ చేయడం లేదని, తమకు రావాల్సిన మొత్తమే ఇంతవరకూ చెల్లించలేదని చెప్పడం గమనార్హం.
వివరాల్లోకెళ్తే.. గ్రూప్ స్టేజ్‌తో పాటు సెమీఫైనల్స్ దశ (రెండింటిలో ఒకటి ముగిసింది) ముగింపునకు వచ్చిన ఏపీఎల్‌లో అంపైర్ల తీరుపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మొదటి సెమీస్ (ప్రీమియమ్ ఇండియన్స్ వర్సెస్ ప్రీమియమ్ పాక్స్) కు ముందు ఈ మ్యాచ్‌లకు అంపైర్లుగా ఉండాల్సిన డానీ ఖాన్, విజయ ప్రకాశ్ మల్లెల, బ్రెయిన్ ఓవెన్స్‌లు తమకు అదనపు డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిర్వాహకులు ఆరోపించారు. డబ్బులు ఇచ్చేదాకా తాము ఫీల్డ్‌కు దిగబోమని తమతో వాగ్వాదానికి దిగినట్టు చెప్పారు. ఇప్పటికే ఈ లీగ్‌లో డౌన్ పేమెంట్ కింద 30 వేల యూఎస్ డాలర్లు చెల్లించినా ప్లేఆఫ్స్ స్టేజ్ ముందు బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు.
Danny Khan ,Vijaya ,Brian Owens were told that they cannot black mail and hold the semi hostage as an umpire but these greedy umpires didn’t budge at which point they were asked to leave so the match goes on and they refused and held the match hostage at which point cops called
— American Premiere League (APL) (@APLCRICKETUSA) December 31, 2023
ఇదే విషయమై అంపైర్ విజయ్ ప్రకాశ్ స్పందిస్తూ.. ‘నాపేరు విజయ్ ప్రకాశ్.. నేను యూఎస్ఎ నుంచి ఐసీసీ ప్యానెల్ అంపైర్‌ను.. ఈ టీమ్ (ఏపీఎల్)లతో కలిసి గత పదిరోజులుగా పనిచేస్తున్నాను. కానీ నిర్వాహకులు మాకు చెల్లిస్తామని చెప్పిన నగదును ఇంతవరకూ ఇవ్వలేదు. మేం మా సొంత ఖర్చులతో రాకపోకలు సాగిస్తున్నాం. కానీ పోలీసులు మాత్రం.. మేం బ్లాక్ మెయిల్ చేస్తున్నామని ఆరోపణలు వచ్చినట్టు మాకు ఫోన్ చేశారు.. మాకు గత్యంతరం లేక వీడుతున్నాం…’ అని తెలిపినట్టు ఉన్న ఓ విలేకరికి చెప్పిన స్క్రీన్ షాట్స్‌ను ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు పీటర్ డెల్లా పెన్నా ట్విటర్లో షేర్ చేయడంతో ఏపీఎల్ పై విధంగా స్పందించింది. అయితే అంపైర్లతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగడమే గాక వారిపై దురుసుగా ప్రవర్తించారని, వారిని దూషించారని ఆరోపిస్తూ పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Here’s another update from the drama unfolding in Texas today at the American Premier League T20 cricket event. Umpires who had the cops called on them by APL official for not taking the field say they refused to take the field because they were owed… Approximately $30,000. https://t.co/rzodjRUVSg pic.twitter.com/VaK5WLeyXM
— Peter Della Penna (@PeterDellaPenna) December 30, 2023