హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ.. లిఫ్టర్ అవతారమెత్తింది. తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీని .. ఈజీగా పైకి ఎత్తుకున్నది. ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను అనుష్కా తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఓ సెట్‌కు వెళ్లిన విరాట్‌ను.. వెనుక నుంచి కౌగిలించుకున్న అనుష్కా.. ఆ తర్వాత తన భర్తను ఈజీగా రెండు చేతులతో పైకి లేపింది. అనుష్కా లిఫ్టింగ్ స్టంట్స్ చూసిన విరాట్.. ఓ తేరీ అంటూ షాక్ అయ్యాడు. మరోసారి పైకి లేపాలంటూ అనుష్కాను కోరాడు. ఎటువంటి హెల్ప్ తీసుకోకుండానే.. మళ్లీ విరాట్‌ను తన చేతులతో బిగించి అనుష్కా ఎత్తుకున్నది. ఆ వీడియోను పోస్టు చేసిన అనుష్కా.. ఇది నేనే చేశానా అంటూ కామెంట్ కూడా పెట్టింది. అనుష్కా పెట్టిన కామెంట్‌కు విరాట్ కూడా రిప్లై ఇచ్చాడు. ఇక ఆ వీడియోకు అతి తక్కువ సమయంలోనే లైక్‌లు తెగ వచ్చేశాయి.