న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో పెర్త్‌లో తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రెండో రోజు అనుష్కా శర్మ(Anushka Sharma) .. ప్రేక్షకుల గ్యాలరీలో కనిపించింది. ఆస్ట్రేలియా ఆలౌట్ అయిన సమయంలో.. ఆమె చీర్స్ కొట్టింది. భర్త విరాట్ కోహ్లీతో పాటు టీమిండియాను ఆమె తన చప్పట్లతో ప్రశంసించింది. వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అనుష్కా.. స్టాండ్స్‌లో సందడిగా కనిపించింది. స్టేడియంలోని ఆ నటికి చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారం క్రితం పెర్త్ వీధుల్లో అనుష్కా, కోహ్లీ జంట దర్శనం ఇచ్చింది. ఓ కాఫీ షాపులో కాఫీ తాగుతున్న దృశ్యాలు చిక్కాయి. ఆ ఫోటోల్లో కూతురు వామికా కూడా ఉన్నది. పింక్ స్వెటర్, బ్లూ డెనిమ్ వేసుకుని .. అనుష్కా కనిపించగా, ఓలీవ్ గ్రీన్ టీషర్ట్‌లో విరాట్ దర్శనం ఇచ్చాడు. ముంబై విమానాశ్రయం నుంచి అనుష్కా, కోహ్లీ వెళ్తున్న దృశ్యాలు కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన విషయం తెలిసిందే. 2017, డిసెంబర్ 11వ తేదీన అనుష్కా, విరాట్ పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు అకాయ్, వామికా పిల్లలు ఉన్నారు.
Anushka Sharma Reaction, After Australia’s last wicket fell. Ahh!!! Finally…😅#INDvAUS #ViratKohli #BGT2025#RishabhPant pic.twitter.com/k1O3NAxdQh
— Sports In Veins (@sportsinveins) November 23, 2024