Virat Kohli | స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) కోసం విరాట్ అక్కడికి వెళ్లారు. భార్య అనుష్క శర్మ (Anushka Sharma), పిల్లలు వామిక, అకాయ్‌తో కలిసి బ్రిస్బేన్ (Brisbane)లో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఖాళీ సమయంలో ఫ్యామిలీతో విరాట్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
తాజాగా ఈ జంట బ్రిస్బేన్‌లోని బ్లూయూస్ వరల్డ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా టేస్టీ లంచ్‌ను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. శాండ్విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్న ఫొటోలను పంచుకుంది. ఈ ఫొటోలకు ‘బెస్ట్ డే ఎవర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోల్లో విరుష్క జంట నవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం భారత్ సన్నాహాలు మొదలుపెట్టింది. అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో భారీ ఓటమి తర్వాత టీమ్ఇండియా సిరీస్‌లో మళ్లీ పుంజుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది. బ్రిస్బేన్ వేదికగా ఈనెల 14 నుంచి మొదలయ్యే మూడో టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. విరాట్‌కోహ్లీ, యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్‌శర్మ, రిషబ్ పంత్, ఆకాశ్‌దీప్‌సింగ్, యశ్ దయాల్, హర్షిత్రానా తదితర ఆటగాళ్లు స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also Read..
Hazlewood: బోలాండ్ ఔట్.. మళ్లీ జట్టులోకి హేజిల్‌వుడ్
Amir Jangoo: చరిత్ర సృష్టించిన ఆమిర్ జంగూ.. తొలి వన్డేలోనే సెంచరీ కొట్టేశాడు
Jason Gillespie: పాకిస్థాన్ కోచ్‌గా జేసన్ గిలెస్పీ రాజీనామా.. తాత్కాలిక కోచ్‌గా అకిబ్ జావెద్