హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ స్కేటర్ అనుపోజు కాంతిశ్రీ మరోమారు సత్తాచాటింది. మొహాలీ వేదికగా జరుగుతున్న జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంతిశ్రీ స్వర్ణం సహా రజత పతకం సొంతం చేసుకుంది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ఈ యువ స్కేటర్ పెయిర్ స్కేటింగ్‌లో పసిడి పతకం దక్కించుకుంది. అదే జోరులో సోలో ఫ్రీ ైస్టెయిల్ ఈవెంట్లో రజతం దక్కించుకుంది. రెండు పతకాలు సాధించిన కాంతిశ్రీని కోచ్ అనూప్‌కుమార్ యమా, పలువురు స్కేటింగ్ ప్రతినిధులు అభినందించారు.