న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్‌లో టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. అండర్-19 విభాగంలో ఈ ఘనత సాధించిన రెండో భారత క్రీడాకారిణిగా అనుపమ రికార్డుల్లోకెక్కింది.
ఈ యేడాది ఉగాండా, పోలండ్‌లలో జరిగిన జూనియర్ అంతర్జాతీయ టోర్నీలలో టైటిల్స్ నెగ్గిన అనుపమ ప్రస్తుతం టాప్ ర్యాంక్‌లో ఉన్న మరో భారత షట్లర్ తస్నిమ్ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.