జాగ్రెబ్: ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 53కిలోల కాంస్య పతక పోరులో అంతిమ్ 9-1తో ఎమ్మా జొన్నా డెనిస్ మాల్మగ్రెన్పై అద్భుత విజయం సాధించింది. మెగాటోర్నీలో ఇక భారత్కు రిక్తహస్తాలే అనుకుంటున్న తరుణంలో తాను ఉన్నానంటూ అంతిమ్ కాంస్యంతో సత్తాచాటింది.
రెండేండ్ల క్రితం ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన అంతిమ్కు ఇది రెండో పతకం కావడం విశేషం. తనదైన దూకుడు కనబరిచిన ఈ 21 ఏండ్ల యువ రెజ్లర్..అండర్-23 వరల్డ్ చాంపియన్ ఎమ్మాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.