US Open | యూఎస్ ఓపెన్.. డిఫెండింగ్ చాంపియన్ల ఇంటిబాట
యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మూడో రౌండ్లోనే ఇంటిబాట పట్టగా మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన కోకో గాఫ్ (యూఎస్ఏ) సైతం నాలుగో రౌండ్లోనే వెనుదిరిగింది.
- యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం
- డిఫెండింగ్ చాంపియన్ నిష్క్రమణ
US Open | న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మూడో రౌండ్లోనే ఇంటిబాట పట్టగా మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన కోకో గాఫ్ (యూఎస్ఏ) సైతం నాలుగో రౌండ్లోనే వెనుదిరిగింది. సోమవారం ఆర్థర్ ఆష్లే స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గాఫ్ 3-6, 6-4, 3-6తో ఎమ్మా నవర్రో (యూఎస్ఏ) చేతిలో పరాభవం పాలైంది. మ్యాచ్‌లో 19 డబుల్ ఫాల్ట్స్ చేసిన గాఫ్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. గాఫ్ 14 విన్నర్లే కొట్టగా ఎమ్మా 20 సాధించి యూఎస్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మరో పోరులో రెండో సీడ్ అరీనా సబలెంక 6-2, 6-4తో ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. చైనా అమ్మాయి కిన్వెన్ జెంగ్ 7-6 (7/2), 4-6, 6-2తో డొన వెకిచ్ (క్రొయేషియా)ను ఓడించింది. క్వార్టర్స్‌లో జెంగ్, సబలెంక తలపడనున్నారు.
జ్వెరెవ్, టియాఫో జోరు
పురుషుల సింగిల్స్‌లో అలగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఫ్రాన్సిస్ టియాఫో(యూఎస్ఏ), ఫ్రిట్జ్ (యూఎస్ఏ), దిమిత్రోవ్ (బల్గేరియా) క్వార్టర్స్ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో టియాఫో.. 6-4, 7-6 (7/3), 2-6, 6-3తో పొపిరిన్ (ఆస్ట్రేలియా)ను ఓడించి వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ చేరాడు. జ్వెరెవ్ 6-3, 1-6, 6-2, 6-2తో నకషిమ (యూఎస్ఏ)ను చిత్తుచేశాడు. క్వార్టర్స్‌లో జ్వెరెవ్-ఫ్రిట్జ్, దిమిత్రోవ్-టియాఫో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో బోపన్న (భారత్), ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 1-6, 5-7తో మొల్టెనీ, గోంజాలెజ్ (అర్జెంటీనా) చేతిలో ఓడారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

