World University Games | న్యూఢిల్లీ: ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. చైనా వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. టీమ్ ఈవెంట్లో పూజ, నిఖిత, మాన్సి, ప్రియాంకతో కూడిన భారత జట్టు 5 గంటలా 12 నిమిషాలా 13 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. చైనా (4:52:2), స్లొవేకియా (5:5:36) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నాయి.