జగిత్యాల, డిసెంబర్ 26 : వచ్చే నెల 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే తెలంగాణ ఎన్సీసీ కేడెట్స్తోపాటు జగిత్యాల మౌంట్ కార్మెల్ సూల్కు చెందిన అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్, పాఠశాల పీఈటీ చేని మంగ ఎంపికైంది. రెండు నెలలుగా హైదరాబాద్లోని ఎన్సీసీ శిక్షణ కేంద్రంలో పాల్గొని ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ ఎన్సీసీ క్యాడట్స్తో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మంగను ఎంపిక చేశారు.