సోమవారం 25 మే 2020
Sports - Mar 31, 2020 , 19:30:51

క‌రోనాపై పోరాటంలో కుంబ్లే

క‌రోనాపై పోరాటంలో కుంబ్లే

క‌రోనాపై పోరాటంలో కుంబ్లే

బెంగ‌ళూరు: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్‌పై పోరాడేందుకు తాను సైతం అంటూ ముందుకొచ్చాడు భార‌త మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే.  త‌న సొంత రాష్ట్రం క‌ర్నాట‌కతో పాటు ప్ర‌ధాన మంత్రి స‌హాయ‌క నిధికి  విరాళ‌మిస్తున్న‌ట్లు కుంబ్లే మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. ‘భార‌త్‌లో కొవిడ్‌-19ను బాలౌట్ చేసేందుకు అంద‌రం చేయిచేయి క‌లిపి ముందుకు రావాలి. పీఎం కేర్స్ ఫండ్, పీఎంఎన్ఆర్ఎఫ్‌, సీఎం రిలీఫ్ ఫండ్ కు నేను విరాళ‌మిస్తున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్‌’ అని జంబో ట్వీట్ చేశాడు. అయితే ఎంత మొత్తం విరాళ‌మిచ్చింది కుంబ్లే ఎక్క‌డా వెల్ల‌డించ‌లేదు. క‌రోనాపై పోరాటంలో ఇప్ప‌టికే స‌చిన్, గంగూలీ, గంభీర్‌, రైనా, విరాట్‌, రోహిత్‌శ‌ర్మ ఆర్థిక స‌హాయం చేసిన సంగ‌తి తెలిసిందే. 


logo