కౌలాలంపూర్ (మలేషియా): స్కాష్ వరల్డ్ చాంపియన్షిప్స్ ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత్కు చెందిన అన్హత్ సింగ్, వీర్ చొత్రాని ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ పోరులో ఐదో సీడ్ అన్హత్.. 3-0తో హెలెన్ టాంగ్ (హాంకాంగ్)ను మట్టికరిపించి ఫైనల్కు చేరింది. పురుషుల సింగిల్స్ సెమీస్లో వీర్ 3-1 తో హిమ్ వాంగ్ (హాంకాంగ్)ను ఓడించాడు. మరో సెమీస్లో ఆకాంక్ష 1-3తో టోబి సె (హాంకాంగ్) చేతిలో ఓడింది.