Anaya Bangar: భారత మాజీ క్రికెటర్ సంజయ బంగర్ కూతురు అనయా బంగర్ (Anaya Bangar) మళ్లీ క్రికెట్ ప్రయాణాన్ని మొదలెట్టనుంది. ఒకప్పుడు అబ్బాయిలతో కలిసి ఆడిన తను.. ఈసారి అమ్మాయిలతో మైదానంలోకి దిగనుంది. ఐదు నెలల క్రితం లింగ మార్పిడి సర్జరీ చేయించుకున్న ఆమెకు ఎట్టకేలకు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ అనుమతి లభించింది. అయితే.. టెస్టోస్టిరాన్ పరీక్షల తర్వాతే అనయకు అవకాశం దక్కనుంది.
అబ్బాయిగా పుట్టిన అనయా బంగర్ లింగమార్పిడి సర్జరీతో అమ్మాయిగా మారింది. ఈ ఏడాది మార్చిలో సర్జరీ అనంతరం మళ్లీ క్రికెట్లో పునరాగమనానికి సిద్ధమవుతోంది. ఇటీవలే ఆమెకు ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. మహిళల బిగ్ బాష్ లీగ్ వంటి టోర్నీల్లో ఆడాలంటే అనయ టెస్టోస్టిరాన్(Testosteron) పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే.. మహిళల ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్జెండర్లపై ఐసీసీ 2023లో నిషేధం విధించింది. అప్పటినుంచి లింగమార్పిడి చేసుకున్నవాళ్లకు టెస్టోస్టిరాన్ పరీక్ష తప్పనిసరైంది.
Anaya Bangar can play Community Cricket, but will have to fulfil testosterone-related eligibility criteria to play ‘Elite cricket’ like the Women’s Big Bash League. ICC has banned transgender players in elite competition, BCCI says they have no policy in place.…
— The Indian Express (@IndianExpress) August 25, 2026
‘క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్ విధానం ప్రకారం ట్రాన్స్జెండర్లు, లింగ వైవిధ్యమున్న క్రికెటర్లకు సీరమ్ టెస్టోస్టిరాన్ పరీక్ష తప్పనిసరి. దాదాపు 12 నెలలుగా వీరిలో లీటర్‌కు 10 నానోమోల్స్ కంటే తక్కువగా సీరమ్ టెస్టోస్టిరాన్ ఉండాలి. 2027 మార్చి నుంచి ఎలైట్ క్రికెట్లోకి నీకు అనుమతిస్తున్నాం. ఆస్ట్రేలియాలో ఉన్నప్పటి నుంచి నీ రక్తనమూనాల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు 10 నానోమోల్స్ కంటే తక్కువ ఉన్నాయి. దాంతో, నువ్వు నిర్దేశించిన ప్రమాణాలు అందుకున్నావు’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ హెడ్ జాక్వీ పార్ట్రిడ్జ్ అనయకు శుభవార్త చెప్పింది.
The surgery was successful. 🤍
I’m still recovering and taking things slowly, but I feel incredibly grateful for the care from Dr. Chet and the team at WIH International Hospital.
It’s been a long journey, and today feels like a very important step … pic.twitter.com/Ged2smPekg
— Anaya Bangar (@anayabangarbnxf) August 23, 2026
టీమిండియా వెటరన్ సంజయ్ బంగర్, కశ్మీరా (వైశాలి) దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి అబ్బాయి పేరు అథర్వ, రెండో కుమారుడి పేరు పుట్టి.. అర్యన్. ఈ ఇద్దరిలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆర్యన్ అండర్ -16, అండర్ -19 విభాగాల్లో భారత ఆటగాడు సర్పరాజ్ ఖాన్(Sarfaraz Khan), అతడి సోదరుడు ముషీర్ ఖాన్‌లతో కలిసి క్రికెట్ ఆడాడు. కానీ, ఇప్పుడు ఆర్యన్ కాస్త అనయాగా అంటే అమ్మాయిగా మారాడు. కొన్నాళ్లుగా ‘ట్రాన్స్‌జెండర్ ఉమెన్’గా వార్తల్లో నిలిచిన అనయా థాయ్‌లాండ్‌లో ఈ ఏడాది మార్చిలోతేదీన లింగ మార్పిడి సర్జరీ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
Anaya Bangar cleared to play female community cricket in Australia!
Anaya Bangar has received clearance from Cricket Australia to participate in female community-level cricket, marking an important step in her cricket journey.
The clearance allows her to compete in community… pic.twitter.com/qM90lsQLLG
— Diganta Guha (@diganta_guha) August 25, 2026
2023లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్న అనయ ఆ థెరపీ దశలను వెల్లడించడం పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు ఎదురైనా సరే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భవిష్యత్‌లో అమ్మాయిగానే తనను తాను ఊహించుకున్న అనయ.. ఎట్టకేలకు లింగ మార్పిడి సర్జరీతో తాను కలగన్న జీవితాన్ని మొదలుపెట్టింది.
గుర్తుపట్టారా ఎవరో ?
ఫేమస్ క్రికెటర్ sanjay Bangar కూతురు Anaya Bangar
సంవత్సరo క్రితం శస్త్ర చికిత్స ద్వారా Aaryan bangar ( అబ్బాయి) గా ఉండే తను అమ్మాయి గా మారారు pic.twitter.com/OP7Pfp7cqO
— AVM (@AvmNews7) August 24, 2026