INS Nipun | ఆగష్టు 31న నేవీలో చేరనున్న ఐఎన్ఎస్ నిపుణ్.. రెండో దేశీయ డీఎస్వీ
INS Nipun : భారత నౌకాదళానికి మరో అదనపు శక్తి చేకూరనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ నిపుణ్ ఆగష్టు 31న, ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నావికాదళంలో చేరనుంది.
INS Nipun : భారత నౌకాదళానికి మరో అదనపు శక్తి చేకూరనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ నిపుణ్ ఆగష్టు 31న, ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నావికాదళంలో చేరనుంది. ఇది దేశీయంగా రూపొందిన రెండో డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ (డీఎస్వీ). ఐఎన్ఎస్ నిపుణ్ నౌక పొడవు 118 మీటర్లు కాగా, ఇది సుమారు 8,560 టన్నుల బరువు (డిస్ప్లేస్మెంట్) కలిగి ఉంటుంది.
సముద్రంపై మన నావికా సామర్ధ్యాన్ని పెంచేందుకు, తీరానికి దూరంలో, లోతులో అన్వేషణ సాగించడంలో ఐఎన్ఎస్ నిపుణ్ ఉపయోగపడనుంది. భారత్ కొంతకాలంగా చెబుతున్న ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఈ నౌక, 80 శాతం దేశీయ సాంకేతికతతోనే రూపొందింది. ఈ నౌకను విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) సంస్థ రూపొందించింది. గత జూలై 30న దీన్ని హెచ్ఎస్ఎల్ సంస్థ ఇండియన్ నేవీకి అప్పగించింది.
అప్పటికే పూర్తిస్థాయి నిర్మాణం, ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ప్రధానంగా సముద్ర అంతర్భాగంలో కార్యకలాపాల కోసం ఈ నౌకను రూపొందించారు. ఆధునిక డైవింగ్ సిస్టమ్‌తో దీన్ని అభివృద్ధి చేశారు. ఇది డీప్ సీ శాచురేషన్ డైవింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందుకోసం ఓ వైపు డైవింగ్ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. ఇది నీటిపైనే తేలియాడుతుంది. కానీ, ఇందులోని డైవర్లు, ఆధునిక రోబోలు, రెస్క్యూ వెహికల్స్ వంటివి అత్యవసర పరిస్థితుల్లో సముద్రంలో డైవింగ్ చేసే సిబ్బందికి సాయం చేయగలదు.
వైద్య సాయం అందించగలదు. సబ్మెరైన్లను రక్షించే చర్యల్లో పాల్గొని, సబ్మెరైన్లకు అండగా ఉంటుంది. నీటిపైన ఉంటూనే, సముద్రం లోపల సాయం అందించడంలో సాయపడుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

