వార్సా: సూపర్‌బెట్ ర్యాపిడ్ టైటిల్ పట్టేసిన భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ బ్లిట్జ్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన టోర్నీలో 9.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా.. 12 పాయింట్లు నమోదు చేసుకున్న పోలాండ్ స్టార్ ప్లేయర్ జాన్ క్రిజ్స్టఫ్ డుడా టైటిల్ చేజిక్కించుకున్నాడు.
బ్లిట్జ్ విభాగంలో ఆనంద్ మూడు విజయాలు సాధించాడు. ఈ టోర్నీలో డుడా మొత్తం 24 పాయింట్లు సాధించగా.. ఆనంద్ 23.5 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు.