హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ కోసం హైదరాబాద్‌లో అంతర్‌జిల్లాల టోర్నీ జరుగనుంది. ఈ నెల 16 నుంచి గచ్చిబౌలి గాడియం స్కూల్ వేదికగా టోర్నీ మొదలుకానుంది.
ఆసక్తి కల్గిన ఫెన్సర్లు అండర్-20 బాలుర, బాలికల విభాగాల్లో పోటీపడేందుకు వయసు ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని నిర్వాహకులు పేర్కొన్నారు.