Coco Gauff | బీజింగ్: అమెరికా యువ టెన్నిస్ క్రీడాకారిణి కోకో గాఫ్ చైనా ఓపెన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ గాఫ్.. 2-6, 6-2, 6-2తో యులియా స్టరొడుబ్త్సెవ (ఉక్రెయిన్)ను ఓడించింది.
మరో క్వార్టర్స్‌లో పౌలా బడోస.. 6-1, 7-6 (7/4)తో చైనాకు చెందిన ఝంగ్ షుయయ్ను చిత్తుచేసింది. సెమీస్‌లో బడోస.. గాఫ్‌తో తలపడనుంది.