మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ఫేవరేట్లలో ఒకరైన అమెరికా అమ్మాయి కోకో గాఫ్నకు క్వార్టర్స్‌లో ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఈ మూడో సీడ్.. 1-6, 2-6తో ఎలీనా స్విటోలినా (ఉక్రెయిన్) చేతిలో చిత్తుగా ఓడింది. ఇరువురి మధ్య రాడ్లీవర్ ఎరీనాలో జరిగిన క్వార్టర్స్ పోరులో వరుస సెట్లలో ఓడిన గాఫ్.. 12వ సీడ్ ఉక్రెయిన్ ప్లేయర్‌కు కనీస పోటీని కూడా ఇవ్వలేక చతికిలపడింది.
ప్రత్యర్థి సర్వీసులను కాచుకోవడంలో విఫలమవడమే గాక ఐదు డబుల్ ఫాల్ట్స్‌తో ఆమె నిష్క్రమించక తప్పలేదు. గాఫ్ స్వయంకృతాపరాధాలను అవకాశంగా మలుచుకున్న స్విటోలినా.. 59 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్ పెట్టి తన కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌కు అర్హత సాధించింది.
సెమీస్‌లో ఆమె.. ఒకటో సీడ్ అరీనా సబలెంకాతో తలపడనుంది. మరో పోరులో సబలెంకా.. 6-3, 6-0తో అమెరికా యువ సంచలనం ఇవా జోవిచ్ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్).. 7-5, 6-2, 6-1తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో మట్టికరిపించి సెమీస్‌కు చేరుకున్నాడు. మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ).. 6-3, 6-7 (5/7), 6-1, 7-6 (7/3)తో లర్నర్ టైన్ (అమెరికా)ను ఓడించాడు. అల్కరాజ్, జ్వెరెవ్ మధ్య సెమీస్ మ్యాచ్ జరుగనుంది.