కంటోన్మెంట్, ఆగస్టు 20: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్స్-2023 పోటీల్లో తెలంగాణ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో తెలంగాణ 16-8తో కేరళాను చిత్తుచేసింది. మన జట్టు తరఫున వీర మణికంఠరెడ్డి, సుధీర్ యాదవ్ చెరో 6 పాయింట్లు.. సంతోష్ సంద్రి 4 పాయింట్లు సాధించారు. మహిళల విభాగంలో రాజస్థాన్ టైటిల్ గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో నామ్‌దేవ్ శిర్గావ్కర్, సందీప్ చౌదరి, విఠల్ విజేతలకు ట్రోఫీ అందించారు.